23/08/2018
#అడవినీతి_అడవి_నేర్పే_నీతి
#అవనిగడ్డలో జరగనున్న #సర్పయాగం లాభమా-నష్ఠమా
#జీవావరణ సమతౌల్యానికి పెను ముప్పు అంటున్న పర్యావరణ వేత్తలు..
రెండేళ్ళుగా పెరుగిపోతున్న #మూషిక దాడి మరింత ఉదృతం అవుతుందని ఆందోళన..
#అడవినీతి సాాగు నీతిగా అవలంభించాలంటున్న పర్యావరణ ప్రేమికులు .
#అనగనగా ఒక రాజ్యం.. పచ్చని పంట పొలాలు, అడవులు సెలయేళ్ళు.. ప్రకృతి గీసిన సుందర వర్ణ చిత్రం లా ఉంటుందా రాజ్యం.. అందులోని అడవి.. అమ్మమ్మ వాళ్ళు చెప్పే వారు గు ర్తుందా కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి.. అలాంటిదా అడవి.. పులులు, సిమ్హాలూ, తోడేళ్ళూ నక్కలూ, వంటి క్రూర జంతువులు, లేళ్ళూ, కుందేళ్ళూ, దుప్పులు మేకలు, గొర్రెలు ఇలా అలరారుతుండేదా అడవి.. #అవనిగడ్డలో జరగనున్న సర్పయాగం లాభమా-నష్టమా అని ప్రశ్నలు లేవనెత్తి ఎప్పుడో అమ్మమ్మ చెప్పిన అడవి కథలెందుకు చెప్తావు సుధీర్ నీకేమీ పని లేదా అనేగా మీ ప్రశ్న.. కాసేపు ఓపిక పట్టండి అక్కడికే వెళదాం ఈ లోపు అడవి నీతిని తప్పితే ఏమవుతుందో #మీరు #చదవని ఒక #యధార్ధ గాధను చదవండి కాస్త ఓపిక చేసుకొని...
పచ్చని చెట్లు, జంతు జీవాలతో కళకళలాడే ఆ అడవి లో నిత్యం మనుగడ పోరు సాగేది.. సాధు జీవులు తమ ఆహారం కోసం చెట్లూ చేమల పై ఆధార పడితే క్రూర జంతువులు ఆ సాధు జంతువులను వేటాడి మనుగడ సాగించేవి.. క్రూర జంతువులతో తాము పడుతున్న ఇబ్బందులను కొత్తగా రాజ్యాధికారం చేపట్టిన యువకుడయిన మహారాజు దృష్టికి తీసుకువెళ్ళి తమను కాపాడాలని కోరాయా సాధు జీవులు.. అమాయకమయిన వదనాలతో చూడగానే జాలిగొలిపేలా ఉన్న వాటిని చూసి ఆ మహారాజు క్రూర జంతువులన్నింటినీ వధించాలని నిర్ణయించారు.. మహారాజు నిర్ణయం తప్పని చెపితే తంటా... అడ్డుకోకుంటే దీర్ఘకాలంలో వచ్చే ఇబ్బందులు తెలిసిన వృద్ధుడయిన మహా మంత్రి చొరవ తీసుకొని రాజా క్రూర జంతువులన్నింటినీ వధిస్తే మన రాబోయే తరాలకు వాటి ఉనికి తెలియ కుండా పోతుంది.. దయచేసి క్రూర జంతువులలో ప్రతీ జాతి నుంచీ నాలుగయిదు జోళ్ళు జంతువులను బంధించి మన జంతుశాలలో పరిరక్షిద్దామని సలహా ఇచ్చాడా మంత్రి.. సరే పెద్ద వాడయిన మంత్రి గారు చెప్పాడు గదా అని యువకుడయిన ఆ మహారాజు ప్రతీ జాతినుంచీ కొన్ని క్రూర జంతువులను #బంధించి మిగిలిన వాటిని #వధించేసాడు...ఇంకేమి ఆ సాధు జంతువులకు ప్రాణా భయం తప్పటంతో రాజుగారికి ధన్యవాదాలు చెప్పి అడవిలో సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి..
ఒక రెండేళ్ళు గడిచాయి.. రాజ్యంలో #వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. పచ్చని పొలాలు #బీళ్ళుగా మారాయి.. #సారవంతమయిన #మాగాణులు నీరులేక #నెర్రెలిచ్చాయి.. ప్రజలు పంటలు లేక అల్లాడి పోయే పరిస్థితి వచ్చింది.. రైతులు తమ దగ్గర ఉన్న ధాన్యం నిల్వలను తమ సోదర సమానులయిన రైతు కూలీలతో పంచుకొని ఎలాగోలా జీవనం సాగిస్తూనే మహారాజు దగ్గరకు వెళ్ళీ ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల గురించి వివరించారు.. రాజు గారు చుట్టు పక్క రాజ్యాలలో పరిస్థితి అధ్యయనం చేసేందుకు అడవి గుండా బయలుదేరాదు.. పచ్చని చిట్టడివి స్థానంలో అక్కడో చిగురు అక్కడో చిగురుతో బ్రతికేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న చెట్ల మోడులు కనిపించాయి.. వేసే చిగురును వేసినట్లే తినేందుకు పోటీ పడుతున్న సాధు జీవులూ దర్శనమిచ్చాయి.. మంత్రి వర్యా ఏమిటిది అని ప్రశ్నించారు రాజా వారు.. మహా రాజా మీరు క్రూర జంతువులను వధించటం మూలంగా ఏర్పడిన పరిస్తితి ఇది అని చెప్పటంతో ఆశ్చర్యానికి గురయిన రాజుగారు మహా మంత్రీ ఏమా ప్రేలాపన అని హుంకరించారు..
మహా రాజా మీరు శాంతిస్తానంటే ఈ పరిస్థితికి కారణం వివరిస్తా అని చెప్పటం ప్రారంభించారు.. క్రూర జంతువుల వధ జరగకముందు అడవిలో ప్రకృతి నిర్ధేసించిన అడవి న్యాయమమలయ్యేది.. అందులో భాగంగా ప్రతీ జీవీ మనుగడ పోరు సాగిస్తూ జీవనం సాగించేవి.. సాధు జీవులు చెట్లను మేసి వ్యర్ధాలను ఎరువుగా అదించేవి.. ఆ సాధు జీవులను వేటాడి క్రూర జంతువులు జీవనం సాగించేవి.. మీరు క్రూర జంతువులను వధించటం తో ఆ జీవావరణ సమతౌల్యం దెబ్బతిన్నది.. తమను చంపి తినే జీవులు లేకపోవటంతో సాధు జీవుల సంఖ్య విపరీతంగా పెరిగింది.. అలా సాధు జీవులు అద్దూ అదుపూ లేకుండా మేయటంతో అడవి అంతరించింది.. అడవి మీదుగా వీచే చల్ల గాలులు తాకక పోవటంతో మేఘాలు కూడా వర్షించకుండా ఇతర ప్రాంతాలకు తేలిపోతున్నయి.. అందుకే ఈ దుర్భిక్షం అని ముగించాడు వృద్ధ మంత్రి.. మరిప్పుడేమిటి మన కర్తవ్యమని అడిగారు మహారాజు.. ఏముంది రాజా మనం కొన్ని క్రూర జంతువులను మన జంతుశాలలో సంరక్షిస్తున్నాము కదా వాటిని తిరిగి అడవిలోకి వదిలితే ఒకటి రెండేళ్ళలో పరిస్థితిలో మార్పు వచ్చి తీరుతుందన్నారు మంత్రి.. యువ మహారాజు ఆసూచనను అమలు చేసాడు.. ఉన్న కొద్దిపాటి క్రూర జంతువులు వేట మొదలెట్టాయి.. మళ్ళీ పరుగు మొదలయింది మనుగడ పరుగు.. సాధు జీవులు ఆహారాన్వేషణతో పాటు మనుగడ పోరు చేయాల్సి రావటంతో అడవి చిగుర్లు తొడిగింది.. చిగుర్లు కొమ్మలయ్యాయి.. భూమిలో నిక్షిప్తమయిన నీటిని వాడుకొని మళ్ళీ పచ్చగా పెరుగుతూ చల్ల గాలులు అందించటం మొదలెట్టాయవి...కొద్ది కాలానికే ఆ చల్ల గాలులకు మేఘాలు ద్రవీభవించి వర్షించటం మొదలెట్టాయి.. కొద్ది కాలానికే రాజ్యం పాడి పంటలతో సుభిక్షం అయింది.. అప్పుడర్ధమయింది తన ముందు పాలించిన తన తాత తండ్రులు ఎందుకు అడవి నీతికి విరుద్దంగా ప్రవర్తించలేదో.. ఇది #అడవినీతి.. #ప్రకృతి సహజ సిద్దంగా నిర్ణయించిన #ఆటవిక నీతి..
* ఇక విషయానికొద్దాం.. అవనిగడ్డ ప్రాంతంలో ఇటీవల #ఒకేరోజు 24 మంది పాము కాటుకు గురయ్యారని మీడియా బాహ్యప్రపంచానికి వెల్లడించింది.. #నెటిజన్లు #ప్రభుత్వం #నిద్రపోతోందా అని విమర్శనాస్త్రాలు సంధించారు.. విషయం ఎమ్మెల్యే, సీఎం దృష్టికి వెళ్ళింది.. #ప్రజల ప్రాణాలకు #ప్రమాదకరంగా మారిన పాములును పట్టి దూరంగా ఉన్న #అడవిలో వదలాలని ప్రభుత్వం నిర్ణయ తీసుకొంది.. నెటిజన్లు సాహో సీఎం, సాహో ఎమ్మెల్యే అంటూ పాలకులకు జేజేలు పలుకుతూ ఆ నిర్ణయాన్ని స్వాగతించారు.. కానీ గత రెండేళ్ళలో ఎలుకల దాడి కారణంగా జరిగిన పంట నష్టం గురించి మాత్రం మరిచారు.. వందల ఎకరాలలో మూషిక దాడి కారణంగా పంట దెబ్బ తిన్నది అదే మీడియా పత్రికల ద్వారా పేజీల కొద్దీ వార్తా కథనాలనూ, చానళ్ళలో ప్రత్యేక బులెటిన్లనూ అందించింది.. ఎందుకిలా జరిగిందన్న ప్రశ్నకు రైతుల నుంచి వచ్చిన సమాధానం సర్ప జాతి తగ్గి పోవటమని... ఒక వైపు పాములు కాటు వేస్తున్నాయి కాపాడాలని మొర, మరో వైపు ఎలుకల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయన్న ఆందోళన..ఏమిటిది ఎందుకిలా.. మూలాలలోకి వెళ్ళక తప్పని పరిస్థితి కదా అందుకే పైన చెప్పిన కారడవి, చిట్టడవి కథ.... కథ గోల వదలి #మూలాలు వెతికే పనిలోకి వెళదాం రండి ఒకసారి.
#బాల్య స్మృతులు దాకా వద్దు గానీ ఒక పదేళ్ళు వెనక్కు వెళదామిప్పుడు.. పొలమెళ్ళే వారందరికీ గుర్తుందా పొలమంటే చుట్టూ ఇద్దరు మనుషులు నడిచి వెళ్ళే వీలుగా గట్లు.. ప్రతీ 50 ఎకరాలకూ ఒక చిన్న ప్రయివేటు డొంక అదికూడా బండి వెళ్ళే వీలుగా.. ప్రతీ 500 ఎకరాలనూ చేరేందుకు వీలుగా కనీసం 3 బళ్ళు తప్పుకొనే వీలుగా సర్కారు డొంక.. పొలం మధ్యలో అక్కడక్కడా గుట్టలు ఆ గుట్ట మీద చెట్లు, ఆ చెట్ల క్రిందేగదా మనం మన తాతతండ్రులతో కలసి రైతుకూలీల సరసన కూర్చొని చద్ది మూటలో, కేరెజీ గిన్నెలో విప్పుకొని భోజనాలు చేసే వాళ్ళం.. ఆ చెట్టు మొదట్లోనే పాము పుట్టలు.. అప్పుడప్పుడూ తల బయట పెట్టి చూసే సర్పరాజం.. గుర్తొస్తుందా ఆ దృశ్యం.. ఎప్పుడయినా ఆ సర్పరాజాన్ని చూసి భయ పడ్డామా లేదుగా.. మరిప్పుడెందుకీ ఆందోళన అదేగా మీ ప్రశ్నా.. ఇప్పటి పొలం పరిస్థితి ఒక సారి మననం చేసుకోండి.. పొలం మధ్య ఉండాల్సిన గుట్ట, దాని మీద నీడనిచ్చే చెట్టు, అక్కడ ఉండాల్సిన పుట్ట,, ఆ పక్కనే భోజనం చేసే కూలీలు..ఏంటీ కనిపించటం లేదా.. సరే అయితే ఒకసారి గట్లు చూద్దాం.. ఇద్దరు పక్కపక్కన నడవాల్సిన గట్టు ఒంటి కాలి బాటగా దర్శనం ఇస్తోందా.. సరే అయితే 50 ఎకరాలకు ఒక బళ్ళ బాట డొంక ఉండాలి కనపించిందా.. ఉండాల్సిందే కనబడటం లేదా... పోనీ 3 వరిగడ్డి బళ్ళు వెళ్ళేందుకు వీలుగా ఏర్పాటు చేసున సర్కారు డొంకయినా కనపడాలే.. అదికూడా కనిపించటం లేదా... కనిపించదు ఎందుకంటే స్వార్దం.. గట్టును ఒంటి కాలి బాటగా మారిస్తే ఒక రెండు మూడు మరకాల ధాన్యం అదనంగా పండిచాలన్న స్వార్దం.. బళ్ళ బాటతో కూడిన డొంకను కలిపేసుకుంటే ఓ రెండు బస్తాల ధాన్యానికి అదనంగా ఢోకా ఉండదన్న స్వార్దం.. సర్కారుడొంక బళ్ళ బాటగా మార్చేస్తే పొలం పొడవునా కనీసం అరెకరం కలుస్తుంది అరెకరం అంటే కనీసంగా 15 బస్తాల అదనపు పంట... స్వార్దం... మరి భోజనాలు చేసే చెట్టూ గట్టు ఏది.. మగతా కూలీలు మగతా రైతులు... మగతా మనసులు...ఎవరే బాధ పడితే మనకేమి..
ఒక పొలం చుట్టూ ఇలాంటి వాతావరణాన్ని మన పెద్దలెందుకు పెట్టారు.. డొక్కల కరువులోనూ ఆ ఆవరణాన్ని ఏమాత్రం చెదర నీయనిదెందుకు.. జీవావరణ సమతుల్యత కోసం.. ఇద్దరు మనుషులు నడిచే గట్టూ మీద రైతు గానీ కూలీ గానీ వస్తే సర్పాలు తేలికగా తప్పుకొనేవి.. గట్టు మీద చెట్టుకింద పుట్టలో ఆ సర్ప రాజమే మన పంటలకు మూషికాల దాడి నుంచి రక్షణగా నిలిచేవి.. బళ్ళ బాట పక్కన, డొంక వెంబడీ వందలాది సర్పరాజాలు ఆ అయకట్టూలోని ప్రతీ ఎకరాకూ కూలీ లేని జీతగాళ్ళులా కావలి కాసేవి... అందుకే ఎప్పుడో తప్ప ఎలుకల బుట్టలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.. మరిప్పుడో... డొంకలు మాయం కావటం, పురుగు మందుల తీవ్రత కారణంగా చాల వరకూ సర్ప జాతి తగ్గి పోయింది.. అక్కడక్కడా మిగిలిన సర్పాలు వేట ముగించుకొని భుక్తాయాసంతో దొర్లేందుకు గట్టూ లేదు డొంకా లేదు.. ఆ కొద్ది పాటి ఒంటికాలి బాట మీదే సేద తీరాలి.. ఈ క్రమంలో కాలు తగిలితే వెంటనే పడే కాటు... వాటి ఆవరణాన్ని సమూలంగా నాశనం చేసివేసిన ఫలితమే నేటి ఈ పాము కాట్లు... వాటిలో కూడా ఎక్కువ ఫ్రీ బైట్ లే.. ఎందుకో తెలుసా గట్టు మీదకు సర్పం చేరిందంటే అప్పటికే వేట పూర్తయినట్లు.. అందుకే విషం లేని, తక్కువ విష పూరిత కాట్లు.. 50% పైగా ఫ్రీ బైట్లే...
మరేమి చేయాలి.. ఈ సంవత్సరానికి వదలి వేసినా రైతులు వెంటనే గట్లను కాస్త పెద్దవిగా చేసుకొని పెట్టుకోవాలి.. సర్పయాగాలు కాదు కావలిసిందిప్పుడు వీలయితే ఆక్రమణలకు లోనయిన సర్కారు డొంకలను పునరుద్దరించాలి.. ప్రకృతి నియమాలను అనుసరించి పెద్దలు ఏర్పాటు చేసిన ఆవరణాలను జీవావరణాలకు అనువుగా మార్చుకొనేందుకు రైతులు స్వచ్చందంగా ముందుకు రావాలి.. అసలే అంతంత మాత్రంగా ఉన్న సర్పాలను పట్టి ఎక్కడో అడవులలో వదలితే గత సంవత్సరం నాగాయలంక, కోడూరు, చల్లపల్లి మండలాలలో తీవ్ర స్థాయిలో జరిగిన మాదిరి మూషిక దాడి మరింతగా జరుగుతంది.. కేవలం సంవత్సర కాలంలోనే వందల రెట్లు తమ సంతానాన్ని పెంచుకొనే మూషిక జాతికి మనుగడ పోరు లేకుంటే గత సంవత్సరం వందల ఎకరాలలో జరిగిన మాదిరి ఇదే జరిగితే వేల ఎకరాలలో నష్టం జరగక తప్పదు.. ఒక సారి గుర్తు చేద్దామని గత సంవత్సరపు మూషిక దాడి మీద నేను అప్పట్లో ఇచ్చిన వార్తా కథనాన్ని మీకోసం ఇక్కడ పొందు పరుస్తున్నాను.. ఒక జీవి పై మరొక జీవి ఆధార పడేలా #ప్రకృతి #నిర్దేశించిన #మనుగడ #పోరులో వేలు పెట్టకపోవటమే మంచిది.. అలా వేలు పెడితే పైన అడవి నీతి అని ఒక నీతి గురించి పెద్దలు చెప్పారు గదా అలా సమతౌల్యం దెబ్బతిని దుష్పరిణామాలు తప్పవు...